ఖడ్గం: ముసుగు వెయ్యొద్దు మనసు మీద
పల్లవి
ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద
ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని
తుఫాను వేగాలతో
చరణం 1
ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా
మనసు చెప్పిందే మనకు వేదం
కాదనేవారే లేరురా
మనకి తోచిందే చేసిచూద్దాం
ఎవరు ఏమంటే ఏంటిరా
ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద
చరణం 2
సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని
ఆ చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని
ఆ దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని
ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్లముందుండగా
అందుకోకుండా ఆగిపోతూ ఉసూరుమంటే ఎలా
ఈ ఉడుకు ఈ దుడుకు ఈ వెనక్కి తిరగని పరుగు
ఉండదుగా కడవరకూ
ఈ వయస్సునిలాగె కరిగిపోనీకు
ముసుగు వెయ్యొద్దు మనసు మీద
చరణం 3
కొంత కాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్లగా
కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటాన లేదుగా
నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ
ఉన్న కొన్నాళ్లు గుండె నిండా సరదాలు పండించనీ
నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడుద్దాం
సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం
ముసుగు వెయ్యొద్దు మనసు మీద

No comments:
Post a Comment